కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 9 :-. సుచి శుభ్రతను పాటిస్తూ రుచికరమైన వంటకాలు తయారు చేసే హోటల్లలో భోజనాలు చేయడం మానావళికి ఎంతో శ్రేయస్కరమని మేడ్చల్ నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి అన్నారు ఆదివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ దేవేందర్ నగర్ ప్రధాన రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మదీనా హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చామకూర మహేందర్ రెడ్డి హాజరై జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవోని కొండల్ ముదిరాజ్ హోటల్ యజమాని రఫిక్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి హోటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా హోటల్ యజమాని రఫిక్ మహేందర్ రెడ్డి తో పాటు మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ల ను శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మహిళ నాయకి మనులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు




