చెన్నై: నీలం తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహాబలిపురంలో 11 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా చెన్నై నుంచి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.




