బిచ్కుంద ఏప్రిల్ 14 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు నాగనాథ్ పటేల్, మాజీ కమిటీ అధ్యక్షులు నాల్చర్ రాజులు బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత తొలి నాయ్యశాఖ మంత్రిగా, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి మన రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్ అంబేద్కర్ ని కొనియాడారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అభినందనీయని, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజా అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడిన వ్యక్తని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వీరితోపాటు తపస్ ఉద్యోగ సంఘం నాయకులు, పిఎంపి వైద్యులు సంఘం, అంబేద్కర్ సంఘం, దండోరా సంఘం, బిఎస్పి నాయకులు, సిపిఐ నాయకులు, గ్రామపంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.





