రైతు వేదిక లో జాతీయ రైతు దినోత్సవం
జహీరాబాద్ డిసెంబర్ 23 (జనంసాక్షి) వ్యవసాయ శాఖ, శ్రీ బ్రహ్మ కుమారి ఈశ్వరీయ సంస్థ వారి సౌజన్యం తో జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు.శుక్రవారం రాంజోల్ గ్రామంలో ని రైతు వేదిక లో జరిగిన వేడుకల్లో వారు మాట్లాడుతూ దేశ 5వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయం లో కౌలు దారు , జమిందారి చట్టం బ్యాంక్ రుణాల కొరకు చేసిన సేవలకు గాను జన్మ దినం రోజున ప్రతి 23 రైతు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. ఆయన సమాది నీ కిసాన్ ఘాట్ అని అంటారని తెలిపారు. బ్రహ్మ కుమారి సంస్థ స్వప్న అక్కయ్య యోగి ఖేతీ పద్దతి వ్యవసాయాలని కోరారు. అంతరం సినియర్ సిటిజన్ రైతుల తో కలిసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రదీప్ కుమార్, రైతు బందు సమితి గ్రామ ఆద్యక్షులు భాస్కర్ చారి, బ్రహ్మకుమారి సంస్థ స్వప్న అక్కయ్య రైతులు బాసిత్, శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,నాగి రెడ్డి, బాబు, క్రిష్ణ కాంత్,జగనాథ్ రెడ్డి, బోయిని జగనాథ్ గోపాల్,పాపన్న,సత్యనారాయన, రవి, రాయిపల్లి పెంటారెడ్డి, వెంకట చెలం, శాంత కుమార్, గుర్రాల జోసెఫ్, జమాల్ బీమన్న, సంపత్, శేఖర్, జమీర్, బస్వరాజ్, నర్సీములు తదితరులు పాల్గొనారు.
రైతు వేదిక లో జాతీయ రైతు దినోత్సవం




