Wednesday, 4 November 2026

వాల్మీకిలను ద్రోహం చేసిన బిఆర్ ఎస్ పార్టీ

 

 

 

 

ఏఐసీసీ కార్యదర్శి,అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 9 (జనం సాక్షి);
1956 కంటే ముందు వాల్మీకులు ఎస్టీ జాబితో ఉన్నారని 8 యేండ్ల నుండి వాల్మీకిలను ద్రోహం చేస్తున్న పార్టీ బిఆర్ ఎస్ పార్టీ అని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని వీరు బాబు ఆఫీసులో గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు.కాంగ్రెస్ పార్టీ నుండి వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి పూర్తి సహకారం ఉంటుందన్నారు.చల్లప్ప కమిషన్,ఆధారంగా క్యాబినెట్ ఆమోదంతో కేంద్రనికి పంపే బాధ్యత బి ఆర్ ఎస్ పార్టీ తీసుకోవాలన్నారు.కేంద్రం దగ్గర నుండి సమాచార హక్కు చట్టం క్రింద సమాచారం తీసుకొంటే నేటికీ కుడా రాష్ట్రం నుండి ఎస్టీ జాబితా నివేదికను పంపలేదని నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని,ప్రస్తుతం బిఆర్ ఎస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు.వాల్మీకుల హక్కులను కాపాడే దిశగా 2014,2018 కాంగ్రెస్ మేనిఫెస్టో లో వాల్మీకి ఎస్ టి డిమాండ్ మేము చేస్తాము అని ప్రకటించామనీ,బోయ వాల్మీకుల ను ఎస్ టి డిమాండ్ కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని,నెల రోజులకు పైన నిరాహారదీక్షలు చేసిన ప్రభుత్వం కు కనువిప్పు కలగలేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ను వాల్మీకులు మళ్ళి నమ్మి మోసపోవొద్దు అని అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి మీ ఆత్మగౌరవం ను పోగొట్టు కొవొద్దని కాంగ్రెస్ పార్టీ వాల్మీకి బోయలకి ఎప్పుడు అండగా ఉంటుంది అని నేను కూడా మీ హక్కులు కాపాడే విధంగా కృషి చేస్తానని వాల్మీకి బోయలు ఎస్ టి లో చేరేవరకు మీవెంటే ఉంటానని అన్నారు.వాల్మీకి నాయకులు మాట్లాడుతూ బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే ల ఒత్తిడితోనే మేము నిరాహార దీక్షను విరమించమని మళ్ళి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బల్గెరా నారాయణ రెడ్డి ,ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ , మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత ,కౌన్సిలర్ శంకర్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జయన్న,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దీపక్,జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు నాగ శిరోమణి,దేవేందర్,
ఫీరోజ్,నాగరాజు గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు,వాల్మీకులు
పాల్గొన్నారు .