హోరాహోరీగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ ఐదవ రోజు లీగ్ పోటీలు
జహీరాబాద్. జనవరి 5 (జనం సాక్షి ) పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో గురువారం నాడు ఖిజర్ యఫై గోల్డ్ కప్ లీగ్ పోటీల్లో భాగంగా రెండు పోటీలు జరిగాయి, ఉదయం మొదటి పోటీలో భాగంగా లైఫ్ లైన్ ఢిల్లీ కిరణ సీసీ మరియు అల్ ఫిర్దోస్ సీసీ శాంతి నగర్ జట్ల మధ్య జరిగిన పోటీలో టాస్ గెలిచి అల్ ఫిర్దోస్ బ్యాటింగ్ ఎంచుకోగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా, 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లైఫ్ లైన్ ఢిల్లీ కిరణ సీసీ జహీరాబాద్ 12.3 ఓవర్లలో 88 పరుగులకు అలౌట్ అవ్వడంతో అల్ ఫిర్దోస్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించింది, బ్యాటింగ్ లో 73 పరుగులు చేసిన జునైద్ శేక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది, మధ్యాహ్నం జరిగిన రెండవ పోటీలో నిజామాబాద్ సీసీ, కలిమ్ జైనూర్ సీసీ జట్ల మధ్య జరగిన పోటీలో టాస్ గెలిచి నిజామాబాద్ సీసీ జట్టుకు బ్యాటింగ్ ఎంచుకుంది, 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా 175 పరుగుల విజయా లక్ష్యంతో బరిలోకి దిగిన కలిమ్ జైనూర్ సీసీ 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టనికి 175 పరుగులు చేయడంతో 2 వికెట్ల తేడాతో కలిమ్ జైనూర్ సీసీ జట్టు విజయం సాధించింది, కలిమ్ సీసీ జట్టు అల్ రౌండర్ ఆకాష్ కాంబే కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న ఖాజా మియా మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఆటల్లో క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ మాక్సుద్, మర్రి బాల్ రెడ్డి, విజయ్ రాథోడ్ జహీరాబాద్ బి ఆర్ ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు, మద్ద రామి రెడ్డి, అబ్దుల్ మతిన్, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, పాల్గొన్నారు.
హోరాహోరీగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ ఐదవ రోజు లీగ్ పోటీలు




