మహిళలకు, బాలబాలికలకు షీ టీమ్ అండగా ఉంటుంది షీ టీమ్ ఎస్సై సాలకమ్మ కొండమల్లేపల్లి డిసెంబర్ 22 జనం సాక్షి న్యూస్: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గురువారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ అధ్యక్షన దేవరకొండ డివిజన్ షీ టీం సబ్ ఇన్స్పెక్టర్ సాలకమ్మ ఆధ్వర్యంలో బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం జిల్లా కళాబృందం వచ్చి పాఠశాలలో బాలికలపై జరుగుతున్న అన్యాయాలను కళారూపంలో వారు చక్కగా తెలియపరచడం జరిగినది విద్యార్థులకు ఏమైనా సమస్య ఉంటే డయల్ 100 కు ఫోన్ చేసి మాకు తెలియపరచాలని వారు కోరారు మరియు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి వాటిని కూడా వినియోగించుకోవాలని ఆమె కోరారు మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో స్నేహభావంతో మెలగవద్దని, వారి వారి ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే విధిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. ఆధైర్య పడవద్దని మహిళలకు అండగా షీ టీం ఎల్లవేళలా పనిచేస్తుందని పేర్కొన్నారు. తమ ఇబ్బందులపై ధైర్యంగా ఫిర్యాదులు చేయాలని తద్వారా ఆకతాయిల అటకట్టించవచ్చని ఎస్ఐ సాలకమ్మ వివరించారు. షీ టీం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందని తెలిపారు కళాబృందానికి హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్ అధ్యక్షత వహించడం జరిగింది మరియు షీటీం కానిస్టేబుల్ నాగార్జున పాల్గొనడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో చేరుపల్లి శ్రీనివాస్, కొర్ర లోక్యానాయక్, శ్రీనివాసులు, సౌజన్య, నీరజ, జనార్దన్ రెడ్డి, నల్ల నర్సింహ, శ్రీపతిరావు, దేవకుమార్, జగదీష్, సూర్య, సైదా నాయక్, అక్కిరెడ్డి, సరస్వతి, మంజుల, రమాదేవి, లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, ఎబినైజర్ మరియు విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
మహిళలకు, బాలబాలికలకు షీ టీమ్ అండగా ఉంటుంది




