Wednesday, 4 November 2026

మహిళలు చట్టాలను ఉపయోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: ఇంటా బయటా వచ్చే సమస్యలను మహిళలు నిర్భయంగా ఎదుర్కొని తమ సత్తా చాటాలని ఐసీడీఎన్‌ మండల పర్యవేక్షక్షురాలు ప్రమీల పేర్కొన్నారు. నవీపేట ఎంపీడీఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడారు. మహిళలు తమ హక్కులు, చట్టాలను వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ఐకేపీ ఏపీఎం సరోజిని, మండల మహిళ సమాఖ్య అధ్యక్షురాలు ఉషారాణిలను సన్మానించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాది మంజిత్‌సింగ్‌, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *