– మహిళా రక్షణలో దేశంలో హైదరాబాద్‌ది నెం.1స్థానం
– అసెంబ్లీలో ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్, నవంబర్16(జనంసాక్షి) : రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో షీటీమ్స్ ఏర్పాటు ద్వారా ఈవ్ టీజింగ్, ఈవ్ టీజర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు గొంగిడి సునిత, శోభ అడిగిన ప్రశ్నలకు ¬ం మంత్రి నాయిని నర్సింహరెడ్డి సభలో సమాధానమిచ్చారు. మహిళల భద్రతే ప్రభుత్వ
బాధ్యత అని మంత్రి నాయిని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 210 షీటీమ్స్ పని చేస్తున్నాయని.. ఒక షీ టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారని మంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు 4260 మందిని ఈవ్ టీజింగ్ కేసు కింద అరెస్ట్ చేశామని.. 9743 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చామని మంత్రి తెలియజేశారు. ఆత్మరక్షణ కోసం యువతులకు శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈవ్ టీజర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. బస్టాండ్, విద్యాసంస్థల ప్రదేశాల్లో షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. ఏఏ ప్రాంతాల్లో షీటీంలు అవసరం ఉందో, ఎక్కడ ఎక్కువ ఈవ్‌టీజింగ్ జరుగుతుందో వంటి విషయాలపై కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే షీటీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. షీ టీమ్స్‌రాకతో రాష్ట్రంలో మహిళలకు వేధింపులు తగ్గుముఖం పట్టాయని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు భద్రత విషయంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందన్నారు. గృహ హింసను అరికట్టేందుకు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అన్ని విధాలుగా మహిళా రక్షణకు తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.




