Thursday, 5 November 2026

మహిళా కార్యకర్త మృతదేహానికి నివాళ్లు అర్పించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ మోపతయ్య

 

 

 

 

 

 

 

అచ్చంపేట ఆర్సీ, 15 ఎప్రిల్ 2023, జనం సాక్షి న్యూస్  : స్థానిక పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో  తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా కార్యకర్త కె. భారతమ్మ నిన్న శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మరణించిన  విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకున్న అచ్చంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ టి. మోపతయ్య  ఆమె ఇంటికి వెళ్లి కె. భారతమ్మ పార్థివ దేహం పై  పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతమ్మ హఠాత్ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఆవేదన వ్యక్తంచేశారు.భారతమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి,  తెలుగుదేశం పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధైర్య పడొద్దని  చెప్పారు,  భారతమ్మ కుమారునికి 5000/-ఐదు వేలు ఆర్థిక సాయం చేశారు, వారితోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరమణ , మల్లేష్ ముదిరాజు, సత్యనారాయణ ,  బాబు ,  నిరంజన్ , అంజి ,మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.