మాదన్నపేట : చంచల్‌గూడ మహిళాజైలును నగర మెట్రోపాలిటన్ కోర్టుల న్యాయమూర్తులు శనివారం సందర్శించారు. న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఇక్కడ జైల్ అదాలత్ జరిగిందని, ఇందులో మూడు కేసులు పరిష్కారమయ్యాయని జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. జైలును సందర్శించినవారిలో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సంగంరెడ్డి, ఏడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిజాముద్దీన్, ఎనిమిదవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీనివాస మూర్తి పాల్గొన్నారు.




