Thursday, 5 November 2026

మహిళా ధారణ హత్య

భీమదేవరపల్లి:జూన్(11)జనం సాక్షి న్యూస్హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో పురాణ స్వరూప (40) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పంచాయతీ కోసం కాలనీకి వచ్చిన మహిళపై తన మరిది కత్తితో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. మృతురాలి భర్త చనిపోగా, రాజు, కిషోర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.