మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

 శుభాకాంక్షలుతెలిపిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌ 07 మార్చి (జనం సాక్షి):  మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సంద ర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేపు(సోమవారం) సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్‌ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ సర్క్యూలర్‌ జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. మహిళా సాధికారత కేంద్రంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి లో మహిళల పాత్ర కీలకం అన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తార న్నారు. మహిళలను అభివృద్ధిపథంలో నడిపించేం దుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్‌, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అంగ న్‌వాడీ, ఆశావర్కర్లకు వేతనాల పెంపు సహా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వి-హబ్‌ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.