మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి..
-ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి
హన్మకొండ బ్యూరో చీఫ్ 7 నవంబర్ జనంసాక్షి
మహిళలు అన్ని రంగాలలో ముందున్నప్పటికీ వివక్షతను ఎదుర్కొంటున్నారని మహిళల రాజకీయ ఆర్థిక సాధికారతకై పార్లమెంట్లో మొదటిసారిగా గలంవిప్పిన గీతా ముఖర్జీ నాయకత్వంలో మహిళా బిల్లును ఆమోదించాలని బిల్లు పెట్టినప్పటికీ 25 సంవత్సరాలుగా బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉందని, ఏకా భిప్రయం లేదని సాకుతో బిల్లుకు మోకాళ్ళ అడ్డుతున్నారని, ఇప్పటికైనా బిల్లును వెంటనే ఆమోదించాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి కార్యదర్శి డిమాండ్ చేశారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కౌన్సిల్ సమావేశం సోమవారం హనుమకొండ సిపిఐ ఆఫీసులో రాస మల్ల దీన అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జ్యోతి మాట్లాడుతూ మహిళలపై పసిపిల్లలపై లైంగిక దాడులు బాగా పెరిగిపోయాయని మద్యం ఏరులై స్వారుతుందని వీటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు సిపిఐ జిల్లా కార్యదర్శి కె. బిక్షపతి మాట్లాడుతూ. బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత మతోన్మాదా దాడులు పెరిగిపోయాయని ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యమైపోయాయని ఉపాధి కల్పన లేకుండా నిరుద్యోగం హెచ్చరిల్లుతుందని విమర్శించారు హిందుత్వ ఏజెండాగా ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో ప్రభుత్వం నడిపిస్తుందని విమర్శించారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి మాట్లాడుతూ నిత్యాసరవస్తుల ధరలు కూరగాయల ధరలు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమైనా విమర్శించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలుగా కోరపల్లి జ్యోతి సహాయ కార్యదర్శిగా యాస్మిన్ ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంచాల రమాదేవి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దెల ఏళ్లేష్ స్వరూప మంగా మౌనిక విజయలక్ష్మి రజిత రాజేశ్వరి ఎస్ స్వరూప తదితరులు పాల్గొన్నారు




