హైదరాబాద్,అక్టోబర్29(జనం సాక్షి ): మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ్యయ్య కారు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో మనుమడితో కలిసి కారులో షాపుకు బయల్దేరాడు. అదే సమయంలో ఓంకార్ ట్రావెల్స్ కు చెందిన సినిమా ఔట్ డోర్‌యూనిట్ వాహనం వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో వెనుకభాగం దెబ్బతిన్నది. అదే ధాటికి కారు ముందుకు వెళ్లి మరో కారుకు తగలడంతో బ్యానెట్ దెబ్బతిన్నది. ఈ మేరకు పొన్నాల కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీమంత్రి పొన్నాల కారుకు ప్రమాదం




