మాజీ పార్లమెంటు సభ్యుడు సూపర్ స్టార్ కృష్ణ కు ఘన నివాళులర్పించిన అభిమానులు

తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ముద్రవేసుకుని ఎంతో మంది అభిమానులను చురగొన్న సూపర్ స్టార్ కృష్ణ  మరణించడంతో ఆయన అభిమానులు  పెబ్బేరు సుభాష్ చౌక్ లో ఆయన చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కృష్ణ అభిమానులు మాట్లాడుతూ నటుడు కృష్ణ మరణ వార్త తర్వాత  ఎంతో బాధ కలిగిందన్నారు. చిన్ననాటి నుండి కృష్ణ అభిమానులగా ఉన్నాం. కొత్త సినిమా విడుదల రోజు మాకు పండగ వాతావరణం ల ఉండేదని అన్నారు. మా ఊళ్ళో టాకీస్ కృష్ణ సినిమా వచ్చిందట టాకీస్ నే పూలతో అలంకరణ చేసి సంబరాలు సంబురాలు జరుపుకునేవారమని అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నారు.  మండల కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొని ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఏలూరు నియోజకవర్గం నుండి 1989 లో గెలుపొంది పార్టీకి ఎంతో సేవసేసారని ఆయన సేవలు కొనియాడారు.  కార్యక్రమంలో కృష్ణ అభిమాన సంగం నాయకులు బోరామోని రాములు యాదవ్, గాడిమూడి కిరణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ వర్ధన్ రెడ్డి,జిల్లా యూత్ నాయకులు గంధం రంజిత్, కృష్ణ అభిమానులు చిన్న ఎల్లారెడ్డి, సునీల్ కుమార్,గణేష్,ఉద్దీష్,భీమయ్యా,మాలిక్,శివ,తదితరులు పాల్గొన్నారు