Tuesday, 3 November 2026

మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మరణం- సంతాపం తెలిపిన‌ సీఎం కేసీఆర్

మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డితో తనకున్న అనుబంధాన్ని KCR గుర్తు చేసుకున్నారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడిగా రామచంద్రారెడ్డికి దేశ వ్యాప్తంగా పేరుందని సీఎం చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9వ శాసనసభ స్పీకర్ గా రామచంద్రారెడ్డి పనిచేశారు. 1990 జనవరి 4 నుంచి ఆ ఏడాది డిసెంబర్ 22 వరకు స్పీకర్ పదవిలో ఉన్నారు. అదే సమయంలో లైబ్రరీ కమిటీకి కొంతకాలం ఛైర్మన్ రామచంద్రారెడ్డి పనిచేశారు. 1929 డిసెంబర్ 3న మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో జన్మించారు రామచంద్రారెడ్డి. ఉస్మానియా యూనివర్శిటీలో బీఏ, LLB వరకు చదివారు. సంగారెడ్డి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.