మాణిక్ రావు ఆశయాలను కొనసాగించాలి. ప్రభుత్వ హస్పత్రి లో 3-వీల్ చైర్స్, బెడ్ అందజేత. బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్.

దివంగత నేత మాజీ మంత్రి మాణిక్ రావు 7వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి శశి ప్రభాతో కలసి తాండూర్ లోని మాణిక్ రావు విగ్రహానికి
తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు నూలి శుభ ప్రద్ పటేల్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు 1969 లో తెలంగాణ ఉద్యమo లో క్రియాశీలా పాత్ర వహించి తాండూర్ పాంత్రంలో బహుజన నాయకుడిగా రాష్ట్ర మంత్రి గా చాల సేవలు అందించారు , తాండూర్ ప్రజలకోసం పీపుల్స్ కాలేజీ ని స్థాపించారు అని, అయన ఆశయ సాధనకు తాండూర్ ప్రజలు కంకణబద్దులు కావాలని అయన పిలుపునిచ్చారు.అనంతరం తాండూర్ ప్రభుత్వ హస్పత్రి లో 3-వీల్ చైర్స్, బెడ్ , ఇవ్వటం జరిగింది, ఈ కార్యక్రమనికి నాయకులు డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి , ముస్తాఫా పటేల్ , రఘు , రామకృష్ణ శుభ ప్రద్ పటేల్ ట్రస్ట్ సభ్యులు భాను , ఆబిద్ చావుస్ విజయ్ నరేష్ గౌడ్ , మొయిజ్ , తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు