హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే
మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. నిమ్స్ కు అనుబంధంగా.. ఎర్రమంజిల్లో నిర్మించే 200 పడకల
మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు మంగళవారంశంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..
ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మొదటిసారిగా రాష్ట్రంలోతొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. గతంలో
రాష్ట్రంలో మూడు ఎంసీహెచ్ ఆస్పత్రులు మాత్రమే ఉండే. ఆ సంఖ్యను27కు పెంచుకున్నాం. తద్వారా గొప్ప ఫలితాలు వచ్చాయి. ఎంసీహెచ్ఆస్పత్రుల నిర్మాణానికి రూ. 499 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఎంసీహెచ్ ఆస్పత్రులను 27కు పెంచడంతో మాతా శిశు మరణాలు తగ్గాయి.తెలంగాణ ఏర్పడక ముందు మాతా మరణాలు ప్రతి లక్షకు 92 మరణాలుఉండే.. దాన్ని 43కు తగ్గించగలిగాం. ప్రతి లక్షకు శిశు మరణాలు 36
ఉంటే 21కి తగ్గించుకున్నాం అని తెలిపారు. మాతాశిశు మరణాలుతగ్గుముఖం పట్టి దేశంలో మూడో స్థానంలో ఉన్నాం. మొదటి స్థానానికివెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అవసరం
ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. గాంధీలో 200 పడకల సూపర్స్పెషాలిటీ, నిమ్స్‌లో 200 పడకలు, అల్వాల్‌లో కూడా 200 పడకలసూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామనితెలిపారు. నిమ్స్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న ఎంసీహెచ్ ఆస్పత్రిని రూ. 55కోట్లతో 4 అంతస్తుల్లో 200 పడకలతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ కృషి చేస్తుంది.ప్రభుత్వ రంగంలో కానీ, ప్రయివేటు రంగంలో కానీ 100 పడకలడయాలసిస్ యూనిట్ ఎక్కడా లేదు. నిమ్స్‌లో కేవలం 34 డయాలసిస్ బెడ్లు మాత్రమే ఉన్నాయి.. వాటిని 100కు పెంచుకుంటున్నాం. దీంతోదాదాపు 1500 మంది రోగులు డయాలసిస్ సేవలు పొందుతారు.వీరందరికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్నాం. డయాలసిస్ రోగులనుకాపాడుకునేందుకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నాం. ఆసరా పెన్షన్లు, ఉచితబస్ పాస్‌లను కూడా అందిస్తున్నాం. ఇవాళ నిమ్స్‌లో రూ. 9 కోట్లతో కొత్తఎంఆర్ఐ మెషీన్‌ను ప్రారంభిస్తున్నాం. 34 మంది కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లకుఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నాం. రోగుల సంఖ్యకుఅనుగుణంగా వైద్యులను పెంచుతున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
మాతాశిశు మరణాలను తగ్గించేందుకే ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ : మంత్రి హరీశ్‌రావు




