ప్రజల్లో భయం తొలగించడానికే అన్న డిసిపి
హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి): ప్రజలలో భద్రతా భావం చేకూర్చడానికి కార్డాన్ అండ్ సెర్చ్‌లు నిర్వహించడం జరుగుతుందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. సైబరాబాద్ కవిూషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పర్వత నగర్‌లో డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 10 మంది సీఐలు,15 మంది ఎస్సైల తో కలిపి దాదాపు రెండు వందల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ ఎ/-లాటున్ బలగాలు.. పది బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. దాదాపు 556 ఇళ్ళలో.. 1520 మందిని తనిఖీ చేసి 28 మంది అనుమానితులను, ఇద్దరు పాత నేరస్థులను
అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 35 బైకులు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.




