Monday, 2 November 2026

రంగంపేటలో వివాదాస్పద భూముల సర్వే సర్వేనెంబర్ 147 లో ఆక్రమణలు జరగలేదు  బొందల గడ్డను తవ్వలేదు… పాత ప్రాణాధిపైన రోడ్డు వేశారు

జనం సాక్షి/కొల్చారం:కొల్చారం మండలం రంగంపేటలోని వివాదాస్పద భూములను శుక్రవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. సంగాయిపేట పెద్ద చెరువు శిఖం భూములు గులాబీ లీడర్లు కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు సంగయ్యపేట పెద్ద చెరువు శిఖం భూములు సర్వే చేశారు. సర్వేనెంబర్ 147 లో 8 ఎకరాల 24 గంటలు పట్టాభూమి ఉండగా అందులో నుండి నాలుగు ఎకరాలు చెరువు కట్ట అలుగు నిర్మించగా ప్రస్తుతం 147 సర్వే నెంబర్ లో 4- 24 గుంటల భూమి ఉన్నట్లు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల సర్వేలో తెలింది. సర్వే నెంబర్ 147 పూర్తి పట్టా భూమిలో తమకున్న భూమిలో కేవలం4- 24 గంటలు భూమి మాత్రమే కలిగి ఉన్నారని మిగిలిన నాలుగు ఎకరాల భూమి చెరువు కట్ట నిర్మాణం, నాలుగు నిర్మాణంలో పోయిందన్నారు. అలాగే ఇట్టి భూమికి వెళ్లేందుకు ముస్లింల బొందల గడ్డను తవ్వేసినట్లు ఆరోపణలు రాగా, అదేమీ లేదని పాత ప్రాణాది గుండా రోడ్డు పోయడంతో చుట్టుపక్కల రైతుల భూములకు రోడ్డు సౌకర్యం కలిగిందని రైతులు తెలిపారు. ఈ ఉమ్మడి సర్వేలో నీటిపారుదల శాఖ ఏఈ మహేష్, సర్వేయర్ అనురాధ ఆర్ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.