Thursday, 5 November 2026

ముఖ్యమంత్రి కెసిఆర్ గుణాత్మకైన నిర్ణయాలతో తెలంగాణ అభివృద్ధి

 

 

 

 

 

;- కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లో దేశానికి ఆదర్శం

;- మహిళలకు పెద్దన్నగా కేసీఆర్

;- రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో  తెలంగాణ సంక్షేమ సంబరాలు

;-రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 9 :-రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ సంక్షేమ సంబరాల లో భాగంగా శుక్రవారం సంగారెడ్డి పి ఎస్ ఆర్ గార్డెన్ లో పలు సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు స్థానిక జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి  ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ హాజరైనారు.ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరంలబ్ధిదారులకు చెక్కుల పంపిణీ,  రెండో విడత గొర్రెల పంపిణి, వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా చింత ప్రభాకర్  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణాత్మకమైన నిర్ణయాలతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అభివర్ణించారు ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలన్న ముఖ్యమంత్రి ఉద్దేశం దేశంలోని కొనియాడ తగిలిందన్నారు. నేడు పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల ప్రజలు మన తెలంగాణ వైపు చూస్తున్నారు అన్నారు. ప్రతి రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ఆయన కొనియాడారు. నేడు తెలంగాణ సంక్షేమ సంబరాల సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ,రెండు మున్సిపాలిటీ లకు చెందిన 358 మంది కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ లబ్ధిదారులకు రూ.35,841,528 విలువ చేసే చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రంలో రెండో విడతగొర్రెల పంపిణీ పథకం ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూరింది అన్నారు.

రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సంగారెడ్డి జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం అధికారులకు ఆదేశించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు ప్రజా సంక్షేమ  కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి, సంగారెడ్డి తాసిల్దార్ విజయకుమార్, సదాశివపేట్ తాసిల్దార్ చక్రవర్తి, కంది తహసిల్దార్, కొండాపూర్ తాసిల్దార్, సి డి సి చైర్మన్ బుచ్చిరెడ్డి, కంది జెడ్పిటిసి కొండల్ రెడ్డి, సంగారెడ్డి జడ్పిటిసి, కొండాపూర్ జెడ్పిటిసి, సదాశివపేట జెడ్పిటిసి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి, కంది టిఆర్ఎస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తోపాటు పలు గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులుతదితరులు పాల్గొన్నారు.