హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని 24 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అంతేకాకుండా 3 జిల్లాలకు సంబంధించిన గ్రంథాలయ సంస్థలకు కూడా చైర్మన్లను ఖరారు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.




