ఉప్పునుంతల : మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కట్ట జనార్థన్‌రెడ్డి ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇంటిలోని ఓ గది పూర్తిగా దగ్థమైంది. గదిలో నిద్రిస్తున్న ఆయన భార్య శకుంతలమ్మ బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది. ఆ సమయంలో కుటుంబసభ్యులంతా మరో గదిలో నిద్రిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన ప్రత్యర్థులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.




