Thursday, 5 November 2026

మాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ముఖ్యఅతిథిగా సమతా సైనిక్ దళ్ జాతీయ నాయకులు దిగంబర్ కాంబ్లే

 

 

 

 

అచ్చంపేట ఆర్సి 14 ఏప్రిల్ 2023  జనంసాక్షి న్యూస్ : రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను అచ్చంపేట పట్టణంలో మాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమత సైనిక్ దళ్ అంబేద్కర్ వాది జాతీయ నాయకులు దిగంబర్ కాంబ్లే హాజరై ప్రసంగించారు. అనంతరం నియోజకవర్గంలోని అమ్రాబాద్ పదర మండలాల నుండి వచ్చిన కళాబృందం  అంబేద్కర్ పాట ఆటలతో సాంస్కృతిక కార్యక్రమాలు  ర్యాలీ గా నిర్వహించారు. కార్యక్రమంలో మేధావులు ,ఉద్యోగులు, అంబేద్కర్ యువజన సంఘాలు, తదితరులు పాల్గొన్నారు