మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మీద చర్చించడానికి జర్మనీ చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ మాస్కో చేరుకున్నారు. క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వీరు ఉక్రెయిన్ సంక్షభ నివారణ సమాలోచనలు జరుపుతారు. ఉక్రెయిన్‌కు యూఎస్ ఆయధాల సరఫరా తదితర అంశాలు కీలకంగా చర్చిస్తారు. పది నెలలుగా ఉక్రెయిన్‌లో ప్రభుత్వానికి, తిరుగుబాటు దళాలకు మధ్య వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.





