కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 16 నాగర్కర్నూల్ జిల్లా డేరు మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం వచ్చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డికి వీఆర్ఏలు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 2020 సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే సల్ వెంటనే అమలు చేయాలని అర్హులైన వీఆర్ఏల పిల్లలకు అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పింఛన్ సౌకర్యం కల్పించాలని వీఆర్ఏలు వినతిపత్రంలో కోరారు. ఇప్పటికీ 22 రోజులు సమ్మె చేస్తున్న వీఆర్ఏల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదని మీరైనా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని కొల్లాపూర్ శాసనసభ్యులు బీరు హర్షవర్ధన్ రెడ్డికి వీఆర్ఏలు వినతి పత్రాన్ని సమర్పించారు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎండి జిల్లాని, కృష్ణయ్య పలు గ్రామాల నుంచి చేసిన వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీరం హర్షవర్ధన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన వీఆర్ఏలు




