మినీ బస్సులలో పాసులు చెల్లట్లేదని రాస్తారోకో
రాజాపేట, డిసెంబర్5 ( జనం సాక్షి): విద్యార్థుల బస్సు పాసులు మినీ బస్సులలో అనుమతించకపోవడంతో స్కూలుకు వెళ్లలేకపోతున్నామని ఆరోపిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు మండలంలోని బసంతపురం గ్రామంలో సోమవారం రాస్తారోకో చేశారు. రాజపేటకు వచ్చే మినీ బస్సు ఎక్కించుకోకపోవడం వల్ల సరిగ్గా పిల్లలు బడికి వెళ్లడం లేదని, ఆ యొక్క బస్సు డ్రైవర్లు ఆపడం లేదని, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ ను గతంలో సంప్రదించామని సమస్య పరిష్కరిస్తామని డిపో మేనేజర్ హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. అయినప్పటికీ సమస్య అలాగే ఉన్నదని విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరిష్కరించాలని సందర్భంగా కోరారు. జిల్లా కలెక్టర్ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు.




