జుక్కల్ , ఏప్రిల్ 9, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని మహారాష్ట్ర సరిహద్దులో గల మిర్జాపూర్ హాన్మాన్ మందిర్ లో ఆదివారం కలెక్టర్ జితేశ్ వి పాటిల్దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ కలెక్టర్ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ నర్సింలు గౌడ్, స్ధానిక సర్పంచ్ షేక్ గఫూర్, స్ధానిక ఎంపిటిసి విజయ్, ఆలయకమిటి అదికారులు, పూజారులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.




