ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రశాంతం
మిర్యాలగూడ,సెప్టెంబర్15 (జనంసాక్షి): నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్న పరువు హత్యకు నిరసనగా ఎస్సీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ హత్యకు నిరసనగా మిర్యాలగూడ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. ఉదయం నుంచే ర్యాలీలు చేపట్టిన సంఘం నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రణయ్ కుమార్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎస్సీ కుల సంఘాల నేతలు తరలి వస్తున్నారు. ఆధునిక సమాజంలో ఇంతగా అబివృద్ది చెందిన టెక్నాలజీలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దారుణమని పలువురు వాపోయారు. పరువు పేరుతో ప్రాణాలు తీస్తారా అని మండిపడ్డారు. కూతురు గర్భవతి అని కూడా చూడకుండా అల్లుడిని హత్య చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి సోదరుడు ఉక్రేయిన్ నుంచి రావాల్సి ఉండటంతో అంత్యక్రియలకు సమయం పట్టే అవకాశముంది.
మ కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని పగబట్టిన తండ్రి.. అల్లుడు ప్రణయ్‌కుమార్‌ని అతి కిరాతకంగా శుక్రవారం అంతమొందించిన విషయం తెలిసిందే. పెల్లి చేసుకోకుండా ఉంటే తన కుమారుడు దక్కేవాడని ప్రణయ్ తండ్రి బాలస్వామి కన్నీరుమున్నీరయ్యాడు.




