మిషన్ భగీరథ కార్మిక జీవితాలతో చెలగాటం సరికాదు
జనం సాక్షి: కొల్లాపూర్ రూరల్: డిసెంబర్ 19
మిషన్ భగీరథ కార్మికుల జీవితాలతో చెలగాటం సరికాదు మా డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాడతాం ఎల్లూరు పంప్ హౌస్ దగ్గర జరుగుతున్న మిషన్ భగీరథ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరుకోవడం జరిగింది కొల్లాపూర్ మండల పరిధిలోని ఏలూరు పంప్ హౌస్ దగ్గర జరుగుతున్న కార్మికుల సమ్మె కు హాజరైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మీ డిమాండ్లు న్యాయమైనవిని పూర్తి సమాచారం తీసుకొని మీకు మద్దతు ఇస్తా అన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అన్నారు గ్రామాలలో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కార్మికుల వేతనాలు పెంచకుండా కడుపులు మారుస్తూ సమ్మె చేస్తున్న కార్మికుల్ని ఉద్యోగం నుండి తీసేస్తామని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు కార్మికులు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఇచ్చి ఈ ఎస్ ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత గుర్తింపు కార్డులు అలవెన్స్లు బోనస్తులు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సమస్యల పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని వారు పిలుపునిచ్చారు సాయి ప్రసాద్ శంకర్ మహేష్ మస్తాన్ పాషా రవీందర్ శివకృష్ణ సురేష్ అశోక్ మల్లేష్ గోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మిషన్ భగీరథ కార్మిక జీవితాలతో చెలగాటం సరికాదు




