Wednesday, 4 November 2026

మిషన్ భగీరథ త్రాగునీరును ప్రతి గడపకు అందించాలి.

మరిపెడ, జులై     (జనం సాక్షి ):
జిల్లాలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు ను అందించే లక్ష్యంగా అధికారులు పని చేయాలని, నిరంతర ప్రక్రియగా త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు, శుక్రవారం  మండలంలోని అబ్బాయిపాలెం శివారులో మిషన్ భగీరథ పాలేరు వరంగల్ సెగ్మెంట్ 170 MLD (మిలియన్ లీటర్ ఫర్ డే)ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అధిక ప్రవాహంతో పామ్ పాండ్ లో ఉపొంగే ఏరేటర్, నీటిలోని మురికి తనాన్ని విడగొట్టే గుణమున్న హలమ్, క్లారిప్లోక్లటర్, ఫిల్టర్ బెడ్స్, క్లియర్ చాటర్ పంపులను, రి సైక్లింగ్ , లాబ్ లను డబ్ల్యు టి పి ఓవర్ వ్యూ, మ్యాప్ లను పరిశీలించిన కలెక్టర్ అనేక అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో పలు అంశాలపై పలు సూచనలు చేశారు,కలుషితం లేకుండా శుద్ధిచేసిన మిషన్ భగీరథ త్రాగునీరు ను ఎలాంటి అంతరాయం లేకుండా 170 మిలియన్ లీటర్ ఫర్ డే చొప్పున తగ్గకుండా అందించడమే లక్ష్యంగా నిరంతర ప్రక్రియగా నీరును అందించాలని అయన అధికారులకు సూచించారు.గత నాలుగు సంవత్సరాల నుండి మిషన్ భగీరథ నీటిని పాలేరు రిజర్వాయర్ నుండి ఈ గ్రిడ్కు కు అందించడం జరుగుతుందాని అన్నారు.జిల్లాలో రెండు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ త్రాగునీరును అందించడం జరుగుతుందని, రిజర్వాయర్ నుండి వచ్చే నీటిలో మురికి తనాన్ని పోగొట్టుటకు హలము ను క్రమం తప్పకుండా వాడాలని, బెడ్లు క్లియర్ చేస్తూ ఒక్క రోజు 50 లక్షల లీటర్స్ (5 ఎమ్ ఎల్ డి) లోయర్ పంపులను ఉపయోగించాలని, శుద్ధి చేయుటకు అవసరం ఉన్నందున నీటిని తగ్గకుండా, ఇసుక బయటకు వెళ్లకుండా చూడాలని తెలిపారు.
వాటర్ అనాలసిస్ ల్యాబ్ను పరిశీలించి వివరాలు తెలుసుకొని ప్రతి 2గంటల కోసారి విధిగా క్లియర్ వాటర్ ను పరీక్షించాలని, శాంపుల్స్ , రా వాటర్ క్లియర్ ఉండేటట్లు చూడాలని అన్నారు. బోడ్లడా, తిరుమలాయపాలెం, మహబూబాబాద్ నిజాం చెరువు, బొద్దుగొండ సంపులకు నీరు అందించడంలో ఎలాంటి అంతరాయం ఉండకూడదని, ఎన్ ఎస్ ఎస్సీ ఫీడిoగ్ ఉందా లేదా, మరింత సమాచారాన్ని అధికారులను కోరగా ఇప్పటివరకూ నీరు అందించడంలో, గ్రిడ్ లో ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని,  బొద్దుగొండ నుండి పంపింగ్ పెడితే కొత్తగూడ , గంగారం మండలాలకు తాగునీరు అందించడం సులభతరమని, ఎలాంటి అంతరాయం ఏర్పడిన వెంటనే పరిష్కరిస్తున్న ట్లు, రెడ్ గ్రీన్ ఆరెంజ్ లతో రంగుల్లో శాతాన్ని, స్థితిని గుర్తిస్తున్నామని, జిల్లాలో 14 మండలలోని 1138  హేబిటేషన్ కు నీరు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్ని హ్యాబిటేషన్ లకు మిషన్ భగీరథ నీరు అందించలేక పోతున్నామో నివేదిక సమర్పించాలని, ఎన్ని ట్యాంకులు నిండడం లేదని, సరిపోవడం లేదని, అస్సలు నీరు అందించడం లేని వాటిపై దృష్టి సాధించాలని అన్నారు , గ్రిడ్ లో వర్షపు నీరు నిల్వ ఉంటున్నందున, రైతులకు ఇబ్బంది కలగకుండా పైపుల ద్వారా బయటకు పంపాలని, 5 వేల విలువైన గంధం మొక్కలు నాటుట లక్ష్యం ఉన్నందున పనులు ప్రారంభించాలని, అట్టి స్థలంలో పామ్ పాండ్ ను , రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.4 జి ఎల్ బి ఆర్ ల నుండి నీరు అందించడం జరుగుతుందని, 2 వేల 200 కోట్ల ప్రాజెక్టును జిల్లాలో ఏర్పాటు చేయడం అదృష్టంగా భావించాలని, ప్రతి ఇంటికి 170 ఎం ఎల్ డి తాగునీటిని అంతరాయం కల్గకుండా అందించే దిశగా శుద్ధి కరించిన నీటిని ప్రతిరోజు అందించే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని అయన తెలిపారు.
ఈ సందర్శనలో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈ ఈ లు సురేందర్, కృష్ణారెడ్డి, డీ ఈ లు స్వామిదాస్, అనూష, ఏఈలు నిషన్క్, రాకేష్ ప్రదీప్ విష్ణులు, తహసిల్దార్ రాంప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.