Thursday, 5 November 2026

మిషన్ భగీరథ పనులపై   మంత్రి హరీశ్ రావు సమీక్ష

 జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిధి మే 26
 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిపై రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి,
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గడ ప్రత్యేక అధికారి హన్మంతరావు, ట్రైనీ ఐఏఎస్ అవిశ్యంత్ పండా, ఆర్ డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రకాశ్, సీఈ జగన్మోహన్ రెడ్డి, ఎస్ఈ చక్రవర్తి, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసా చారి, ఆర్ డబ్ల్యూఎస్ డిప్యూటీ ఏఈలు, ఇతర ప్రజాప్రనిధులు పాల్గొన్నారు.