మెట్పల్లి టౌన్, జనవరి 22,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున మున్సిపల్ పరిధిలోని వెంకట్రావు పేట శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ కలిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించాలి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైపులైన్లు ఎక్కడ పడితే అక్కడ లీకేజీ అవడం తరచూ జరుగుతుంది, నాణ్యత లోపించడం వల్ల ఇలా జరుగుతుందని,తెలంగాణ ప్రభుత్వం తన లబ్ధి కొరకు కాంట్రాక్టర్ లతో కుమ్ముకై కమిషన్ల స్వలాభం కోసం మిషిన్ భగీరథ పనులు నాణ్యత లేని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా లీకేజీలు మరమ్మత్తులు చేసి పట్టణ ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు ,ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం శేఖర్, పుల్లా రాజా గౌడ్, చింత కింది శ్రీధర్ ,చంద్రశేఖర్ , ఇల్లెందుల రాజు, రాంప్రసాద్ ,ఎండి అజీమ్, అమీర్ తదితరులు పాల్గొన్నారు
మిషన్ భగీరథ పైప్ లైన్ ను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు




