Monday, 2 November 2026

మీసేవ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్

మీసేవ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్
తిరుమలగిరి (సాగర్) జనవరి 01 (జనం సాక్షి): మండల కేంద్రంలో ఆదివారం ఎంపీపీ ఆంబోతు భగవాన్ నాయక్ మండల కేంద్రానికి ఆంగోత్ కోటేష్ కు మంజూరైన మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం పక్కన ఈ మీసేవ కేంద్రం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు వారి అవసరాలకు మీ సేవ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రంగుండ్ల సర్పంచ్ లీలావతి కొట్యా నాయక్, గిరిజన సంఘం నాయకుడు మేరావత్ మునినాయక్ ,బాలు, అచ్చు నాయక్ ,నాగేందర్, నరేష్, హరి, శౌరి తదితరులు పాల్గొన్నారు.