ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం అందించిన: దేవస్థానం ఈవో
ధర్మపురి 27(జనం సాక్షి న్యూస్) సోమవారం జనవరి 2న ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున జిల్లా పరిషత్ చైర్మన్,కలెక్టర్ రవి,S.P సింధు శర్మ, శాసనమండలి సభ్యుడు జీవన్ రెడ్డి,రమణ,అడిషనల్ కలెక్టర్ కు ముక్కోటి ఉత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటి సభ్యుడు ఇందారపు రామయ్య వీరు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేయడమైనది. ఒక ప్రకటనలో తెలిపారు.దేవస్థానం ఈవో శ్రీనివాస్ మీడియాకు తెలుపుతూ,నూతన సంవత్సరం రెండవ తేదీన జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు,ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం. ముస్తాబవుతుంది.ఉత్సవాలను పకడ్బందీగా,అందంగా, నయానానందంగా, నిర్వహించడానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యనిర్మాణాధికారి సంకటాల శ్రీనివాస్, సిబ్బంది,అర్చకులు,వేద పండితులు,ప్రణాళిక బద్ధంగా కార్యాచరణలు సిద్ధం చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు.




