హైదరాబాద్:సచివాలయంలో ముఖ్యమంత్రిని హోంగార్డు సంక్షేమ సంఘ నాయకులు కలిశారు. ప్రస్తుతం వచ్చే రూ.6వేలతో నగరాల్లో బతకటం కష్టంగా ఉందని సంఘం అధ్యక్షుడు రమేశ్ అన్నారు. ఇంటి అద్దెలు, పాఠశాల ఫీజులు, నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని పోలీసులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం రోజుకు ఇస్తున్న 2వందల రూపాయాలను 4వందలకు పెంచి, ఉద్యోగభద్రత, ఆరోగ్య శ్రీ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.




