హుజూర్ నగర్ మే 26 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని, బిఆర్ఎస్ పై పూర్తి భరోసాతో పలు పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన సిపిఎం ముఖ్య నాయకులు బండారు బిక్షం, బండారు మైసయ్య, బండారు వెంకన్న, బండారు గురవయ్య, బండారు అంజయ్య, బండారు గోపి, తదితర 50కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఇస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడే వారికి ప్రతి స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు . బిఆర్ఎస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు శ్రీరామరక్షగా ఉన్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ కులాలకు సమచిత స్థానం లభిస్తుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు దళిత బంధు పథకం ద్వారా న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కీత జ్యోతి రామారావు, మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రధానకార్యదర్శి మామిడి వెంకటేశ్వర్లు, షేక్ సైదా హుస్సేన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్ బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిడమర్తి అంజి, మండల బీసీ సెల్ కీత నాగరాజు, మండల సోషల్ మీడియా తేలబాటి నరేష్, గోపాల్ దాస్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష – అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి




