నాగర్ కర్నూల్ ఆర్సీ మే 26(జనంసాక్షి):తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాకొండ సబ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా,కె.సుధాకర్ లాల్ సబ్ సెంటర్ పరిధిలోఅందిస్తున్న వైద్య సేవల రికార్డులను పరిశీలించారు.ఈ సంద్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా,కె.సుధాకర్ లాల్ మాట్లాడుతూ,సబ్ సెంటర్ పరిధిలో అందిస్తున్న వైద్య సేవలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని,గర్భిణీలకు అందించే సేవలలో నిర్లక్ష్యం వహించొద్దని,కె.సి.ఆర్ నుట్రిషన్ కిట్ సకాలంలో అందించి గర్భిణీల లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు.గర్భిణి లకు,చిన్నారులకు నిర్దేశించిన సమయంలోనే వాక్సినేషన్ అందించాలని,దీర్ఘకాలిక వ్యాధులు బిపి,షుగర్,క్యాన్సరు,టీబీ తదితర వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహణ కల్పించాలని,జిల్లా వైద్య అరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్ని అరోగ్య కార్యక్రమాల్ని విజయవంతం చేయాలన్నారు.
రాకోండ సబ్ సెంటర్ ఆకస్మిక తనిఖీ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్.




