Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలి

 

 

 

 

 

 

:- ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలి కలెక్టర్ వల్లూరి క్రాంతి

:-  జిల్లా వివిదశాఖల అధికారులతో సమీక్షా సమావేశం.

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి జూన్ 5 : ఈనెల 12న జిల్లా ఐ డి ఓ సి కార్యాలయ ప్రారంభానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పర్యటన విజయవంతం చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశము హాలు లో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12న గద్వాలకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కచ్చితంగా విధులు నిర్వహించాలన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చూడాలన్నారు ట్రాఫిక్ నియంత్రణ సెక్యూరిటీ హెలిపాడ్ దగ్గర భద్రత పార్కింగ్ తదితర పనులపై పోలీస్ శాఖ ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. వీవీఐపీలకు కూర్చోవడానికి కుర్చీలు అరేంజ్మెంట్ ప్రోటోకాల్ ఇన్విటేషన్ తదితర పనులను ఆర్డిఓకు అప్పగించారు. ఐ డి ఓ సి లో ప్లాంటేషన్ పుష్పాలంకరణ డయాస్ అలంకరణ తదితర పనులను హార్టికల్చర్ అధికారికి నిర్వహించాలని ఆదేశించారు మూడు రోజుల ముందే అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతర జిల్లాలలో జరిగిన కార్యక్రమాలను వీడియోల ద్వారా గమనించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్ అండ్ బి శాఖ ఐడిఓసిలో రెడ్,గ్రీన్ కార్పెట్లు ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 11 లోపు లైటింగ్ సిస్టం ప్లాంటేషన్ గ్రీనరీ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 11 వరకు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. డ్రోన్ కెమెరా యాంకరింగ్ స్పీచ్ తదితర పనులను డిపిఆర్ఓ నిర్వహించాలని, పాసులు, డయాస్ పనులను ఆర్డిఓ అదనపు కలెక్టర్ చూడాలన్నారు. ఐ డి ఓ సి భవనం ముందు కలర్ఫుల్ లైటింగ్ పుష్పాలంకరణ ఆర్ అండ్ బి శాఖ నిర్వహించాలన్నారు. ఐ డి ఓ సి ప్రవేశ ద్వారం దగ్గర స్వాగతం పలకడానికి పూజారి సన్నాయి మేళం ఏర్పాటుకు ఈడి రమేష్ బాబు నిర్వహించాలన్నారు. వి వి ఐ పి భోజనం ఏర్పాటు తదితర పనులు సంబంధిత అధికారులు చూడాలన్నారు. మీటింగ్ హాల్ కెపాసిటీని బట్టి కుర్చీలు ఏర్పాటు ఆడియో సిస్టం ఏర్పాటు డిపిఆర్ఓ నిర్వహించాలన్నారు. ఐ డి ఓ సి లోపల బయట శానిటేషన్, క్లీనింగ్ పనులు మునిసిపాలిటీ నిర్వహించాలని ఆదేశించారు. ఏ శాఖకు అప్పగించిన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.