వేమనపల్లి,మార్చి16,(జనంసాక్షి):
వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన శంకర్ 38000/- సత్యనారాయణ 38,000/- నీల్వాయి గ్రామానికి చెందిన హస్గర్ అలీ 60000/- శిరీష 16000/- వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోళీ వేణుమాధవ్ రావు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు.అనారోగ్యానికి గురైన ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా నిధులు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్,ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈకార్యక్రమంలోనీల్వాయి మాజీ సర్పంచ్ రుద్రబట్ల లక్ష్మి నారాయణ,చామనపల్లి సర్పంచ్ జెల్ల మొండి,ఎంపీటీసీ ధగాం బాపు,మాజీ సర్పంచ్ సంతోష్,మాజీ కో అప్షన్ సభ్యులు హమీద్ ఖాన్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు
తదితరులు పాల్గొన్నారు.




