Friday, 6 November 2026

వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు రైతుల విజయమే. – ఎంపీపీ సంతోషం రమాదేవి.

వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు రైతుల విజయమే.
– ఎంపీపీ సంతోషం రమాదేవి.
నెన్నెల, డిసెంబర్ 9, (జనంసాక్షి )
గొల్లపల్లి లో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు రైతుల విజయం అని నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని గొల్లపల్లి లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సందర్బంగా ఆమె మాట్లాడారు. గత ఆరు సంవత్సరాలనుండి కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేయడం తో రైతులు పోరుబాట పట్టారు. కొనుగోలు కేంద్రంలోని అవకతవకలను ఎత్తి చూపితే వరి కొనుగోలు కేంద్రాన్నే ఎత్తేస్తారా రైతులు ఉద్యమం లాగా పోరాడటంతో అధికారులు మెట్టుదిగి వరి కొనుగోలు కేంద్రం పునః ప్రారంభిచారని, రైతుల పోరాట పటిమ గొప్పదని ఆమె అభివర్ణించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సింగతి శ్యామల, వైస్ ఎంపీపీ గురునాదం సుమలత, ఎంపీటీసీ హరీష్ గౌడ్, స్థానిక సర్పంచ్ ఇందూరి శశికళ, మైలారం సర్పంచ్ కొండ లక్ష్మి, ఏపీఎం విజయలక్ష్మి, సీసీ సువర్ణ, నాయకులు సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాం చందర్, సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, ప్రేమ్ సాగర్ గౌడ్, జాడి నారాయణ, రాజయ్య, రాగులయ్య, మొగిలి, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు