ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం

కొత్తగూడ ఆగస్టు 13 జనంసాక్షి: కొత్తగూడ మండల లోని దుర్గారం పంచాయతీ చిన్న తండాకు చెందిన బోడ దేవేందర్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.వారి కుటుంబానికి కొత్తగూడ బారాస మండల కమిటీ అండగా నిలిచారు.నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక లక్ష 25 వేల రూపాయల చెక్కు ను మంజూరు చేయించారు.అట్టి చెక్కును బాధితుల స్వగృహం వద్ద అందజేసి శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబానికి అండగా నిలిచారు.ఈ సందర్భంగా కొత్తగూడ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు యాదవ్ మాట్లాడుతూ నర్సంపేట శాసనసభ్యులు కొత్తగూడ మండలం తో ఉన్న బంధంతో పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద మనస్సు తో బోడా హనుమ కుటుంబానికి చెక్కు రావడానికి కృషి చేసి అండగా నిలిచినందుకు మా కొత్తగూడ మండల ప్రజలకు భరోసా కల్పించి నందుకు మేము మా మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి తండాలలో గుడాలలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను కూడా కంటికి రెప్పల కాపాడుతూ అండగా ఉంటుందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు .ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఈసం స్వామి కొత్తగూడ అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్, గుంజేడు సర్పంచ్ అజ్మీర రజిత రమేష్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ పరమేష్. మాలోత్ వీరన్న.దయ్యాల శీను. ఉప సర్పంచ్ విజేందర్ పత్తిపాక వెంకన్న తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు