
;- నియోజకవర్గంలో సోషల్ మీడియా వినియోగం, ప్రతిపక్షాల అసత్యపు ఆరోపణలను తిప్పికొట్టడం, సోషల్ మీడియా బలోపేతం తదితర అంశాలపై వారియర్స్ కి దిశానిర్దేశం చేశారు.
;- ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు మాట్లాడుతూ..
;- గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
;- మన రాష్ట్రంలో అందుతున్నటువంటి రైతు సంక్షేమ పథకాలు దేశంలో మరే ఏ రాష్ట్రంలో అందడం లేదు.
;- బీఆర్ఎస్ పార్టీకి రైతులే వెన్నుముక. తెలంగాణ రైతాంగ మొత్తం కేసీఆర్ వెంట నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
;- కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని , ధరణిని ఎత్తేస్తామని రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 3 గంటల కాంగ్రెస్ కావాలా.. 24 గంటల బీఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
;- కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరాకుల తయారవుతుంది.
;-14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలి.
;- గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు విస్తృతంగా తీసుకెళ్లాలి.
;- సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యపు ఆరోపణలు, విష ప్రచారాలను వ్యక్తిగతంగా కాకుండా విశ్లేషణాత్మకంగా త్రిప్పికొట్టాలి.
;- రానున్న పది రోజుల్లో నియోజకవర్గంలో గ్రామ, మండల, మున్సిపాలిటీ వార్డుల వారీగా సోషల్ మీడియా కమిటీలను నియమిస్తాం.
;- సోషల్ మీడియా వారియర్స్ ప్రణాళిక బద్ధంగా పనిచేస్తూ సోషల్ మీడియా బాధ్యతలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పనిచేయాలి.
;- పార్టీ డిజిటల్ మీడియా నుండి వచ్చేటటువంటి అభివృద్ధి, సంక్షేమ వివరాలను అన్ని సోషల్ మీడియా ఎకౌంట్ల ద్వారా చేరవేయాలి.
;- ప్రతిపక్షాల ట్రాప్ లో పడవద్దు. వ్యక్తిగత దూషణలకు దిగవద్దు. ఎవరిని రెచ్చగొట్టే విధంగా దూషించవద్దు.
;- యువకులుగా.. విద్యావంతులుగా బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై గ్రామాల్లో విస్తృత చర్చ పెట్టాలి.
;- నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులను వీడియోల రూపంలో, కంటెంట్ రూపంలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.
;- క్షేత్రస్థాయిలో పనిచేసే క్రమంలో నాయకులను, ప్రజా ప్రతినిధులను కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్లాలి. పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది.
;- ఈనెల చివరి వారంలో నియోజకవర్గంలోని 5,000 మంది సోషల్ మీడియా వారియర్స్ కు శిక్షణ అందిస్తాం.
✍🏻 ఈ సమావేశంలో పాల్గున్న సత్యప్రసాద్ గారు, రవీందర్ గారు, విజయానంద్ గారు, చెన్నూరు నియోజకవర్గం లోని సుమారు 500 మంది వారియర్స్.




