ముఖ్య మంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో అభివృద్ధి పథంలో అలంపూర్ నియోజక వర్గం. అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.

అలంపూర్ జూలై 11(జనంసాక్షి )
దేశ ప్రజలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, దేశంలోనే
ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అలంపూర్ శాసనసభ్యులుడాక్టర్.వి.యం.అబ్రహం అన్నారు. మంగళవారం అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో అలంపూర్ మున్సిపాల్టీ లో మైనార్టీ షాది ఖానా నిర్మాణం కొరకు 30 లక్షల రూపాయలు, ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయల మంజూరు చేయడం జరిగింది.అట్టి ప్రొసీడింగ్స్ కాపీలను మైనర్టీ నాయకులకు ఎమ్మెల్యే అబ్రహం అందజేశారు.ఈ సందర్బంగా వారు ఎమ్మెల్యే కి ఘజ మాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదవాడి సంక్షేమంపై సీఎం ప్రత్యేక దృష్టిసారించి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి పేద వారికి అండగా నిలుస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆకలిచావులు ఆత్మ హత్యలు లేకుండా పేద కుటుంబాలకు ఆసరా పింఛన్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలను అమలు చేస్తూ వారికి కొండంత అండగా నిలుస్తారని అన్నారు.
60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ
ఏనాడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 200 రూపాయల పెన్షన్ అందిస్తే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఎంతో గౌరవంగా సమాజంలో జీవించేలా వారికి ఈ రెండు వేల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. గతంలో ఆడపిల్ల పుడితే
భారం గా భావించే నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంతోషించే స్థాయికి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్నారు.
గతంలో ముస్లిం మైనార్టీలను ఓటర్లుగా మాత్రమే గత పాలకులు భావించారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నారన్నారు. పేద ముస్లిం విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి, ప్రతి విద్యార్థి మీద లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో సకల వర్గాల సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని,సకల వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రుణం ఓటు వేసి తీర్చుకోవాలని,మూడవసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ తిరిగి ఎన్నుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డా.వి.యం.అజయ్, కొంగల రవి బాబు, ఖత్తర్ ,కో ఆప్షన్ మెంబర్ అల్ల భకష్ ,మైనార్టీ నాయకులుషేక్ అహ్మద్ , వలి సబ్ ,పెద్ద ముక్తార్ ,చిన్న ముక్తార్ ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఫాయాజ్ ,మాజీ డైరెక్టర్ రహమత్ , మోళన అబ్దుల్ రోఫ్ , ఖలీల్ , మరియు మైనార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు