రైతులను కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరం – డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ : తెలంగాణ రైతులను కించపరిచే విధంగా రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా రైతులను కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అలాగే 24 గంటల ఉచిత కరెంట్ అందించి రైతులను ఆదుకుంటున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం ఎకరాకు రూ. 5000 చొప్పున రెండు దఫాలుగా రూ. 10000 ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అలాగే రైతులను ఆదుకునేందుకు నిరంతరం విద్యుత్ అందిస్తే మూడు గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజావార్తలు