ముగిసిన బిజ్వారం ప్రీమియర్ లీగ్ సీజన్ 3
మల్దకల్ జనవరి 7 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ రాజారెడ్డి ఆధ్వర్యంలో డిసెంబర్ నెల 28వ తేదీన ప్రారంభించారు.బిజ్వారం గ్రామంలో తొమ్మిది రోజులపాటు జరిగిన బిజ్వారం ప్రీమియర్ లీగ్ సీజన్ 3లో 8 జట్లు పాల్గొనగా అందులో ఫైనల్లో శుక్రవారం హోరా హోరీగా సాగిన అవెంజర్స్ వర్సెస్ వైల్డ్ హంటర్స్ జెట్లు తలబడ్డాయిగా చివరికి అవెంజర్ టీం మొదటి బహుమతిగా గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది.గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి 40 వేల రూపాయలు ఎంపీపీ రాజారెడ్డి అందజేశారు.రెండవ బహుమతి వైల్డ్ హంటర్ జట్టుకు మాజీ ఎంపీపీ వై సత్య రెడ్డి కుమారుడు వై మల్లికార్జున్ రెడ్డిఅందజేశారు.మూడో బహుమతి గెలుపొందిన సూపర్ స్టార్ జట్టుకు 15000 రూపాయలు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు ఆర్ తిమ్మారెడ్డి అందజేశారు.నాలుగోవ బహుమతి గెలుపొందిన ప్రమీల రాణి జట్టుకు 10,000 సర్పంచ్ లక్ష్మన్న అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ వై రాజారెడ్డి మాట్లాడుతూ బిజ్వారం ప్రీమియర్ లీగ్ సీజన్-1, సీజన్ -2, సీజన్ 3 విజయవంతంగా చేసినందుకు ముఖ్యంగా గ్రౌండ్ దాతలకు, క్రికెట్ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేయడం జరిగింది.విద్య తో పాటు క్రీడా రంగాలలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి. క్రికెట్ కబడ్డీలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్రీడాకారులు జాతీయస్థాయిలో క్రికెట్ ఆడడం జరిగింది.గ్రామీణ ప్రాంతంలో యువకులు కబడ్డీతోపాటు క్రికెట్ క్రీడల్లో కూడా ఎక్కువ నైపుణ్యత చెబుతున్నారు.ప్రతి ఒక్కరూ క్రికెట్ క్రీడల్లో మంచి ప్రదర్శన ఇచ్చి రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రీడ ప్రదర్శన వేయాలి.గ్రామ అభివృద్ధితో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎంపీపీ రాజారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రూతమ్మ,తిమ్మన్న, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సోమేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులునాగేశ్వర్ రెడ్డి, రవి,వెంకటన్న, ఆశన్న,దాసు, అంజి,రాము, క్రికెట్ మేనేజ్మెంట్ శ్రీనివాసులు, హేమంతు,బికే రామ్,సిద్దు,ప్రతాప్,వెంకటేష్,ఈరన్న గ్రౌండ్ దాతలు రాగి మాన్ శ్రీనివాసులురెడ్డి, నారాయణ,తిప్పన్న, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




