ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
కొడకండ్ల,జనవరి15 (జనంసాక్షి)
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో వివేకానంద స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల వాలీబాల్ టోర్నమెంట్ శనివారం రోజున ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పేరం రాము, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరక దృఢత్వానికి ఎంతగానో తోడ్పడతాయని,అదేవిధంగా ఎప్పుడు క్రీడలు నిర్వహించిన మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, త్వరలో కబడ్డీ,వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తే మా వంతు సహకారం అందిస్తామని ఈ మూడు రోజుల వాలీబాల్ టోర్నమెంట్ అన్నదాత పేరం రాము అన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గూడూరు 16000 రూపాయలు, షీల్డు ను గెలుపొందారు.ఈ మొదటి బహుమతి దాత స్వర్గీయ చెరుకు బుచ్చమ్మ జ్ఞాపకార్థం అందించారు. రెండవ బహుమతి జఫర్ఘడ్ 12000 రూపాయలు,షీల్డును గెలుపొందగా ఈ బహుమతిని కుందూరు అమరేందర్ రెడ్డి అందించగా, మూడవ బహుమతి 8000 రూపాయలు, షీల్డును చల్వాయి గెలుపొందగా ఈ బహుమతిని దామెర రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం అందించారు. నాల్గవ బహుమతి మైలారం 6000 రూపాయలు, షీల్డును గెలుపొందగా ఈ బహుమతిని నామాల చంద్రయ్య జ్ఞాపకార్థం అందించారు. ఈ మూడు రోజుల వాలీబాల్ టోర్నమెంట్ కు అన్నదాత వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పేరం రాము, క్రీడాకారులకు దుస్తుల పంపిణి వివేకానంద స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బందారపు రాము తండ్రి జ్ఞాపకార్థం అందించారు. అదేవిధంగా క్రీడా పరికరాలను ఇండియా వాలీబాల్ క్రీడాకారిణి ఉప్పల కవిత,సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు గుండా పూర్ణాచందర్,గుండా వెంకన్న అందించారు. అదేవిధంగా ఫ్లడ్ లైట్స్ ను లైన్ మెన్ కాంబోజి సతీష్,జూనియర్ లైన్ మెన్ కుమార్,సీనియర్ క్రీడాకారుడు మిట్ట యాకేశ్ రెడ్డి అందించారు.అదేవిధంగా సీనియర్ క్రీడాకారుడు సీలూరు నాగేష్ ఒక సంవత్సరం క్రితం చనిపోగా అతని కుటుంబానికి వివేకానంద స్పోర్ట్స్ అసోసియేషన్ తరుపున 15000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.అదేవిధంగా వివేకానంద స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ కు సహకరించిన దాతలకు,క్రీడా బృందానికి మరియు పెద్దలకు అసోసియేషన్ అధ్యక్షుడు బందారపు రాము కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దాతలు మున్ముందు సహాయ సహాకారాలు అందిస్తే మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డైరెక్టర్ కోటగిరి కుమార్,జిల్లా ఎల్ఐసి ఏజెంట్ దామెర రమేష్,దామెర రవీందర్, మరియు దాతలు, మీడియా మిత్రులు, సీనియర్ క్రీడాకారులు సుంకరనేని మురళీధర్,కడారి చంద్ర శేఖర్, దూదిగాని నాగరాజు, చెరుకు జనార్ధన్,భూమా సంపత్,మడిపెద్ది అశోక్ మరియు క్రీడాకారులు, క్రీడాభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.




