హిందువాహిని మహిళా విభాగంఆద్వర్యం లో మొగ్గుల పోటీలు…
భైంసా రూరల్ జనవరి 15 జనం సాక్షి
ముగ్గుల పోటీలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికలని, హిందూ వాహిని మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీ మహాదేవ్ మందిరంలో ముగ్గుల పోటీ కార్యక్రమ0 ఏర్పాటు చేశారు. హిందూ వాహిని మహిళా విభాగ అధ్యక్షురాలు స్వరూప, ఉపాధ్యక్షురాలు మానసవీణ పోటీలలో పాల్గొన్న వారికి అభినందనలు తెలియజేశారు. సీనియర్ విభాగాల0లో లక్ష్మి ప్రధమ బహుమతి,మేఘన ద్వితీయ బహుమతి పొందగా…జూనియర్ విభాగం లోప్రధమ బహుమతి శ్రీ లక్ష్మి,ద్వితీయ బహుమతి చందనలక్ష్మి గా గెలుపొందారు.ఈ నిర్వహణ కార్యక్రమానికి అతుల్ సీడ్స్ కంపెనీ లిమిటెడ్ దినేష్ తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమంలోగల్లీసర్పంచ్ సాయినాథ్,ఉప సర్పంచ్ నిమ్మలల్లో గట్టు, కోశాధికారి కుంట కాశీనాథ్,కాండ్లి సాయినాథ్, హిందువాహిని నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.




