Saturday, 7 November 2026

ముదిరాజ్ యువజన సమాఖ్య బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షుడిగా బండి నాగరాజు

ముదిరాజ్ యువజన సమాఖ్య బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షుడిగా బండి నాగరాజు
బచ్చన్నపేట డిసెంబర్ 26 (జనం సాక్షి)
ముదిరాజ్ యువజన సమాఖ్య బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షుడిగా బండి నాగరాజు ని నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దాసరి క్రాంతి ముదిరాజ్ తెలిపారు. ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ఆదేశాల మేరకు ముదిరాజ్ యువత పటిష్టం కొరకు గ్రామ గ్రామాన కమిటీలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు. మండల ఉపధ్యక్షునిగా ఎన్నికైన బండి నాగరాజు మాట్లాడుతూ ముదిరాజ్ సమస్యలపై పోరాడుతామని, గ్రామ స్థాయి నుండి ప్రతి ముదిరాజ్ కుటుంబానికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ముదిరాజులను రాజకీయంగా ఎదగనీయకుండా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా బీసీ డీ నుండి బీసీ ఏ కు మార్చాలని ఎన్నో ఏళ్ళు గా పోరాటం చేస్తున్న కూడా ఫలితం లేదని అన్నారు. తనపై నమ్మకంతో తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు దాసరి క్రాంతి కుమార్, మండల అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్ ముదిరాజ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జనరల్ సెక్రటరీ గంగరబోయిన రాజు, రఘునాథ్ పల్లి మండల అధ్యక్షుడు పండుగ చంద్రశేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.